ఎస్విబిసి ఛైర్మెన్ పదవి ‘ఈ’ ఇద్దరిలో ఒకరికేనా

గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున విస్తృత ప్రచారం చేసి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి చేజిక్కిచుకున్న పృథ్వీరాజ్ నోటిదురుసు, వ్యవహార శైలి టీటీడీ ప్రతిష్ఠను పూర్తిగా మంటగలిపాయని పలు విమర్శలు వెల్లువెత్తాయి. . అయితే గట్టిగా ఆరు నెలలు కూడా ఆ పదవిలో ఉండలేకపోయాడు. చివరకు పదవి పోయి పరువు పోయి రాజకీయాలకు దూరమయ్యే పరిస్థితికి వచ్చాడు. ఓ ఆడియో టేప్ కారణంగా అతా రెండు రోజుల్లో అతని పరిస్థితి తారుమారయ్యింది. దీంతో తన ఎస్వీబీసీ పదవికి రాజీనామా చేశాడు. దాంతో ప్రస్తుతం ఎస్వీబీసీ కొత్త చైర్మన్గా ఎవర్ని నియమించలన్న విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు.
ఓ వైపు సినిమా డైరెక్టర్, వైఎస్ఆర్కు అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్ రెడ్డి పేరు వినిపిస్తున్నా… జగన్ మాత్రం ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి మహిళకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు పలు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ స్వప్న పేరును ప్రభుత్వం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్వీబీసీ డైరెక్టర్గా ఉన్న స్వప్న గతంలో సాక్షి టీవీకి ఫేస్ ఆఫ్ ద ఛానెల్ గా ఉన్న విషయం తెలిసిందే. ఎస్వి బీసీ చైర్మైన్ గా ఓ సీనియర్ పాత్రికేయురాలు ఓ మహిళ కు అవకాశం ఇవ్వనున్నన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ పదవికి సంబంధించి ప్రముఖంగా రెండు పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఈ ఇద్దరిలో జగన్ ఎవరికి ఓటు వేస్తారన్నది వేచి చూడాలి. సిని దర్శకుడు శ్రీనివాస్ రెడ్డికి కూడా జగన్ ఇప్పటికే ఎస్వీబీసీ డైరెక్టర్గా నియమించారు.