గోడ మీద వార్తలు

01 . పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో కొందరు నేతల పర్సులు ఫోనులూ కొట్టేసిన – దొంగలు …
రేయ్ … రేయ్ ….పొలిటీషియన్లు జనాన్ని దోచుకోటం ఆనవాయితీ గానీ – ఆళ్ళనే దోచుకోవటం మన దేశ సంప్రదాయం కాదురా …!!
02. ఎయిర్ టెల్ – వోడాఫోన్ల మాదిరిగానే డేటా మరియు వాయిస్ చార్జీలని 40% పెంచు తున్నట్టు ప్రకటించిన – జియో …
ఆళ్ళంటే నీ దెబ్బకి సంకనాకిపోయారు కాబట్టి పెంచారంటే అర్థముంది – నీకేం కష్టం వచ్చిందని సామీ…??
03. మరోసారి తెరపైకి వచ్చిన విశాఖ మెట్రో అంశం – అనకాపల్లి టు భోగాపురం అంటూ గిర్రున తిరిగిన వార్త …
అప్పట్లో ఫస్టు బడ్జెట్లో కేటాయించిన మూడు లక్షల్లో ఫ్లెక్సీలకీ – పోష్టర్ల మైదా ఖర్చులకీ పోగా ఏ మాత్రమో మిగిలినట్టున్నాయి – పేపరోడికిచ్చి వార్తేయించుంటారు – అంతే…!!
04. మహారాష్ట్రలో ప్రైవేటు ఉద్యోగాల్లో 80% స్థానికులకే రిజర్వేషన్ కల్పించేలా చట్టం తెస్తాం – మహరాష్ట్ర గవర్నర్ …
దేశ ఆర్ధిక రాజధానిలో ఇట్టాంటేషాలేస్తే – అసలే అంతంత మాత్రంగా ఉన్నది సాంతం చాప ఏస్కుని తొంగుంటాది సామీ…!!
05. అనంతపురంలో గ్రామ సచివాలయానికి పార్టీ రంగులేసింది చాలక సచివాలయం పై పార్టీ జెండా ఎగరేసిన – కార్యకర్తలు …
రోజు రోజుకీ ఏటీయం మెషీనుకి బదులు పాస్ బుక్ అప్డేట్ చేసే మిషనెత్తుకెళ్ళిన బ్యాచుల్లా తయారవుతన్నార్రా సామీ…!!
మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!!
“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ” 
:||: జై హింద్ :||:

Leave a Reply

Your email address will not be published.