స్వీటీ ఆస్తుల విలువ ఎంత?

మంగుళూరు బ్యూటీ అనుష్క శెట్టి (37) టాలీవుడ్ అగ్ర కథానాయికగా దశాబ్ధం పైగానే వెలుగులు ప్రసరించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్లలో అనుష్క ఎంత ఆర్జించింది? అంటే షాక్ తినే లెక్కలు తేలాయి. అనుష్క ఇప్పటికే 142 కోట్లు ఆర్జించింది.  రూ.5కోట్ల వార్షికాదాయంతో ఇప్పటికి ఇంత ఆర్జించింది. స్వీటీకి పలు నగరాల్లో విలువైన బంగ్లాలు, ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.  సొంత ఇల్లు, అపార్ట్ మెంట్లు, కార్లు, బంగారు వజ్రాభరణాలు వీటి విలువ చాలా పెద్దదే. తన కార్ డ్రైవర్ పుట్టినరోజు కానుకగా ఈ బ్యూటీ రూ.12లక్షల విలువైన కార్ ని కానుకగా ఇచ్చి సర్ ప్రైజ్ చేసిందని, స్వీటీ ఆస్తుల విలువ ఇదీ అంటూ ప్రఖ్యాత టైమ్స్ నవ్ వివరాలు వెల్లడించింది. స్వీటీ ఆస్తుల్లో ఓ ఇంటి విలువ 12 కోట్లు ఉంటుందట. ఖరీదైన కార్ల విలువ కొన్ని కోట్ల విలువ చేస్తుంది. టొయోటా కొరొల్లా ఆల్టిస్ -21లక్షలు, ఆడి ఏ 6 విలువ- 56 లక్షలు, ఆడి క్యూ 5 – 62 లక్షలు, బీఎండబ్ల్యూ 6 సిరీస్ కార్ – 67లక్షలు పెట్టి కొనుక్కుంది. స్వస్థలం మంగుళూరు, కాలేజ్ డేస్ .. ఫ్యాషన్ వరల్ లో మోడలింగ్ డేస్ లో అనుబంధం ఉన్న బెంగళూరులో భారీగానే ఆస్తులు కూడగట్టింది.  వైజాగ్ లోనూ స్వీటీకి పలు విలువైన భూములు ఉన్నాయని సన్నిహితులు చెబుతుంటారు. ఇక అనుష్క కెరీర్ పరంగా పరిశీలిస్తే  ౠసూపర్‌ౠ (2005) సినిమాతో తెరంగేట్రం చేసింది. 13ఏళ్ల కెరీర్ లో 50 చిత్రాల్లో నటించింది. ఒక్కో సినిమాకు రూ.2-3 కోట్ల యావరేజ్ ఆర్జనతో స్వీటీ ఈ స్థాయిలో సంపాదించారని టైమ్స్ నవ్ విశ్లేషించింది

Leave a Reply

Your email address will not be published.