20వ చిత్రం ‘జాన్’ సినిమాలో నటిస్తున్న యంగ్‌రెబల్ స్టార్

యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్  ప్రస్తుతం జాన్ సినిమాలో నటిస్తున్నారు. సాహో సినిమాతో కొంచెం బ్రేక్ తీసుకున్నా తర్వాత జాన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ వివరాలను ట్వీట్ చేశాడు. నా కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తున్న విషయం మీతో షేర్‌ చేసుకుంటున్నందుకు సంతోషిస్తున్నాఅని తెలిపాడు. 

ఈ షూటింగ్‌ షెడ్యూల్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానంటూ ప్రభాస్‌ చేసిన ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రభాస్‌ జేబులో చేతులు పెట్టుకుని ఓ అందమైన భవంతిలో పైకి చూస్తున్నపుడు తీసిన ఫొటోను షేర్‌ చేసుకున్నాడు. ఈ ఫొటో చూస్తుంటే సినిమా లొకేషన్‌కు సంబంధించినట్లు అర్థమవుతోంది. జిల్‌ ఫేం రాధాకృష్ణ  ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్‌ 20వ చిత్రంగా వస్తోన్న ఈ ప్రాజెక్టుకు టైటిల్‌ మార్చాలని నిర్మాతలు భావిస్తున్నట్లు ఓ వార్త ఫిల్మింనగర్‌లో చక్కర్లు కొడుతుంది.

Leave a Reply

Your email address will not be published.