తొలి సినిమాతోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించే అరుదైన అవకాశం కొట్టేసింది సయీ మంజ్రేకర్…

ఈ నటి దబాంగ్ 3 చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రియురాలిగా కనిపించి అద్బుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ త్వరలోనే తెలుగ ప్రేక్షకులను పలుకరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ సరసన నటించే అమ్మాయి కోసం నిర్మాతలు సయీ మంజ్రేకర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. నిర్మాతలు ఈ విషయంపై సయీతో చర్చలు జరిపే యోచనలో కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కిరణ్ కొర్రపాటి-వరుణ్‌తేజ్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మరి హీరోయిన్గా సయీ మంజ్రేకర్‌ను ఎంపిక చేస్తారా..లేదా అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.