ఏపీ రాజధాని పై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలుహైదరాబాద్: ఏపీ రాజధాని వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజన చేశామని గుర్తుచేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాక రాష్ట్రంలో రవ్వంత కూడా వ్యతిరేకత రాలేదని తెలిపారు. కానీ ఏపీలో మాత్రం రాజధాని విషయంలో వ్యతిరేకత వస్తోందన్నారు. ఎందుకనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ సూచించారు. 
 
తెలంగాణ ఎన్నికల సందర్బంగా కేటీఆర్ మీడియాతో చిట్ చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతి అంశంపై ఆయన మాట్లాడారు. ఏపీలో మూడు రాజధానులు ఉండవచ్చునని సీఎం జగన్ ప్రకటన తర్వాత ఒక్కసారిగా విమర్శలు, ఆందోళనలు జరగుతున్నాయన్నారు. 29 గ్రామాల రైతులు పెద్ద ఎత్తు ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఎక్కడా చిన్న సంఘటన జరగకుండా కేసీఆర్ విజయవంతంగా పరిపాలన సాగిస్తున్నారని గుర్తుచేశారు.  తెలంగాణలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, అందరినీ ఒప్పించి, మెప్పించి కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారన్నారు.  

Leave a Reply

Your email address will not be published.