హ్రితిక్ రోషన్ సాంగ్ కి నితిన్, రష్మికల లవ్లీ డాన్స్..

యంగ్ హీరో నితిన్ వెండితెర ప్రయాణం సాఫీగా సాగుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్న ఆయన.. ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలను ఓకే చెప్పేశాడు. అందులో ఒకటి భీష్మ. ఈ సినిమాలో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ముగింపు దశకు చేరింది. ఇటీవలే హైదరాబాదులో నితిన్, రష్మిక జంట పై ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ ఫినిష్ చేశారు. మరికొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది.

నితిన్, రష్మిక మండన్న హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇటలీలోని పాసిటానో ప్రాతంలోని అందమైన లొకేషన్స్ లో జరుగుతోంది. తాజాగా ఈ ప్రాంతంలో నితిన్, రష్మికలు ‘వార్’ సినిమాలోని హ్రితిక్ రోషన్ సాంగ్ ‘గుంగురో’ సాంగ్ కి డాన్స్ చేసిన వీడియోను షేర్ లవ్ యు హ్రితిక్ అంటూ పోస్ట్ చేసారు నితిన్ రష్మికలు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published.