ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విజయశాంతి డైలాగు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే రోజా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని విజయశాంతి డైలాగులతో సభను రక్తి కట్టించింది. ఏపీ శాసన మండలి రద్దు తీర్మానంపై జరిగిన చర్చలో రోజా తెలుగుదేశం నాయకులపై ఘాటు విమర్శలు చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన బిల్లులను టీడీపీ అడ్డుకోని  రాష్ట్రాభివృద్ధికి సహకరించడం లేదని ఆమె మండిపడింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఈ బిల్లుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. 

అయితే గాయం విలువ తెలిసిన వాడే సాయం చేయగలడు అంటూ సరిలేరులో విజయశాంతి డైలాగ్‌ని చెబుతూ, పాదయాత్రలో జగన్ తనకు అయిన గాయాలు మర్చిపోయి ప్రజల గాయాలు తెలుసుకుని వాటికి చికిత్స చేస్తున్నారని అన్నారు. శాసన సభలో ప్రజలు ఎన్నుకున్న 151 మంది ఎమ్మెల్యేలు బిల్లును ఆమోదించి పంపితే అలాంటి బిల్లును మండలిలో వ్యతిరేకించి అవమానించారని, ప్రజల కోసం ఉపయోగపడని కౌన్సిల్ అవసరం లేదని అన్నారు. శాసనమండలి రద్దవడానికి కనీసం రెండేళ్లు పడుతుందని, ఒకవేళ రద్దయినా తాను మళ్లీ తీసుకొస్తానంటూ చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో చెప్పడం కాదని దమ్ముంటే శాసన సభలో వచ్చి మాట్లాడాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published.