సిటీ సివిల్ కోర్ట్ కి ఎక్కిన చిన్మ‌యిగాయ‌నిగా డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా కొద్ది కాలంలోనే ఎంత పేరు తెచ్చుకుందో… వివాదాల కార‌ణంగా అదే స్థాయిలో పేరు తెచ్చుకున్న‌వారెవ‌రైనా ఉన్నారా అంటే అంద‌రి వేళ్లు చిన్మ‌యి వేపే చూపిస్తాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె ప్ర‌ధానంగా మ‌హిళా సాధికార‌త విష‌యంలో ఎప్పుడూ ముందుంటూ చేసే సంచ‌ల‌న పోస్ట్‌లు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైపోతున్నాయి. ఆమ చేస్తున్న ఆరోప‌ణ‌లు స‌హించ‌లేక ర‌చ‌యిత‌ వైర‌ముత్తు, ద‌ర్శ‌కుడు, డ‌బ్బింగ్ క‌ళాకారుడు రాధా రవి ల వ‌త్తిడితో ఆమె డ‌బ్బింగ్ యూనియ‌న్ నుంచి వెలివేసారు కూడా. 


అయినా ఎక్క‌డా రాజీ ప‌డ‌ని ఈ గాయ‌నీమ‌ణి ఏ సంఘం అయితే త‌న‌ని నిషేధించిందో అదే సంఘానికి అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీకి దిగ‌టం ఇప్పుడు త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌గా మారింది. ఈ ఎన్నిక‌ల్లో పాల్గొన‌కుండా చూసేందుకే త‌న‌పై నిషేదం విదించారంటూ సిటీ సివిల్ కోర్ట్ కి ఎక్కిన చిన్మ‌యిని లీగ‌ల్‌గా డ‌బ్బింగ్ యూనియ‌న్ మెంబ‌ర్‌గా కోర్టు గుర్తించ‌డంతో పాటు ఓటు హ‌క్కు కూడా క‌ల్పించాల‌ని సూచించింది. దీంతో త‌న‌ని ఓటు వేయ‌కుండా. పోటీ చేయ‌కుండా ఎవ‌రూ అడ్డుకోలేర‌ని స్ప‌ష్టం చేస్తూ, త‌న‌పై నిషేధించ‌డానికి ప్రధాన కార‌కుడైన రాధార‌వి అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తుండ‌గా ఆత‌ని పైనే చిన్మ‌యి పోటీకి దిగ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్పుడు చిన్మ‌యికి మ‌ద్ద‌తుగా కొంద‌రు డ‌బ్బింగ్ క‌ళాకారులు ఏక‌మ‌వుతుండ‌టం విశేషం. రేపు రాబోయే ఫ‌లితాలు చిన్మ‌యికి వ‌రంగా మారినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదంటున్నారు మ‌రి కొంద‌రు . ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published.