కళ్యాణ్‌రామ్ సినిమా పబ్లిసిటీకి రంగంలోకి ఎన్టీఆర్
సంక్రాంతి సీజన్ వరుస సినిమాలు విడుదలవుతుండటంతో ఏసినిమా పరిస్థితి ఎటువైపుకు వెళుతుందో అర్ధం కాని పరిస్థితి. దీనికి తోడు ఏపిలో రేగుతున్న రాజధాని తరలింపు ప్రకంపనలు సినీ జనాలపై ఆందోళన కలిగిస్తునే ఉంది. ఈ క్రమంలోనే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘ఎంత మంచివాడవురా’ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 15వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. కుటుంబ కథా చిత్రాల దర్శకుడుగా పేరున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం. భారీ చిత్రంలతో పోటీగా విడుదలవుతున్నా.. మిగిలిన చిత్రాలతో పోల్చుకుంటే పబ్లిసిటీ పూర్‌గానే కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటు సామాజిక మీడియాతో సహా ప్రేక్షకులను అలరించేలా ఉండటం ఈ చిత్రంపై కొంత సానుకూలత కనిపిస్తోంది .
తాజాగా ఈ చిత్ర ప్రమోషన్లో అన్న కళ్యాణ్‌రామ్‌కు కాస్త సాయం చేసేందుకు తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ రడీ అవుతున్నాడు.
జనవరి 8వ తేదీన జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతున్నాడు ఎన్టీఆర్. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఈ ఈవెంట్ జరగనుండటంతో యూనిట్ భారీ ఏర్పాట్లే చేస్తోంది. ఎన్టీయార్ ఈ చిత్రానికి మంచి ఊపు తీసుకువచ్చి హైప్ లోకి తేస్తాడని చిత్రయూనిట్ నమ్మకంగా ఉంది. మరేంజరగ నుందో చూడాలి