రూల‌ర్‌: బాల‌య్యని స్టేజ్ మీద వేదిక అలా అనేసిందేంటి?


బాలయ్య అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. దాన్ని మరోసారి నిరూపిస్తూ పక్కా మాస్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి వస్తున్నాడు నందమూరి నటసింహం. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. జై సింహా సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన కేయస్ రవికుమార్ ఈ చిత్రంతో బాల‌య్య‌కు మ‌రో హిట్ ఇవ్వ‌బోతున్నారు. బాలయ్యను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా చాలా కొత్తగా చూపించాడు దర్శకుడు కేయస్ రవికుమార్. ముఖ్యంగా ఆయన గెటప్‌కు ఫ్యాన్స్ నుంచి కిరాక్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు టీజర్‌లో కూడా ఈ గెటప్ హైలైట్ అయింది. మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయాడు ఈ సీనియర్ హీరో.  ఈయన నటిస్తున్న `రూలర్ ` చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ను వైజాగ్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈవెంట్ లో బాల‌య్య‌తో స‌హా చిత్ర యూనిట్ అంతా పాల్గొని సంద‌డి చేస్తుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్లు ఇద్ద‌రూ బాల‌య్య గురించి ఈ విధంగా స్పందించారు. సోనాల్ మాట్లాడుతూ… ముందుగా ఇక్క‌డ‌కు ఇంత అభిమానంగా విచ్చేసిన బాల‌య్య‌గారి ఫ్యాన్స్ అంద‌రికి నా న‌మస్కారాలు. ఆయ‌న‌తో ఇది నా మూడో చిత్రం. బాల‌య్య‌గారితో న‌టించ‌డం నాకు చెప్ప‌లేనంత ఆనందంగా ఉంది. ఆయ‌న‌తో న‌టించ‌డానికి నాకు ఇంత గొప్ప అవ‌కాశం రావ‌డం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన కె.ఎస్‌. ర‌వికుమార్‌గారికి నా ప్ర‌త్యేక కృతజ్ఞ‌త‌లు. న‌న్ను న‌మ్మి నాకు ఇలాంటి పాత్రనిచ్చినందుకు సి.క‌ళ్యాణ్‌గారికి కూడా కృత‌జ్ఞ‌త‌లు. ప్ర‌తి ఒక్క‌రూ నాకు చాలా స‌పోర్ట్ చేశారు. జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అద్భుత‌మ‌నే చెప్పాలి. రాంప్ర‌సాద్‌గారు ఈ సినిమాలో న‌న్ను చాలా అందంగా చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్‌. ఈ లెజెండ్ బాల‌య్య మొత్తం బాక్సాఫీస్‌నే రూల‌ర్ చిత్రంతో రూల్ చేస్తాడు అని అన్నారు.

వేదిక మాట్లాడుతూ… బాల‌య్య‌గారితో ఇది నా మొద‌టి చిత్రం. ఆయ‌న నాకు చాలా హెల్పింగ్ గా ఉన్నారు. సీనియ‌ర్ న‌టుడైనా కూడా ఎక్క‌డా గ‌ర్వం లేకుండా నాతో చాలా చ‌క్క‌గా క‌లిసిపోయేవారు. నాకు యాక్టింగ్ విష‌యంలో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు. న‌ట‌న‌లో కొన్ని కొన్ని చిట్కాలు కూడా చెప్పారు. ఆయ‌న దగ్గ‌ర నేను చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ఆయ‌న సెట్‌లో ఉంటే అంతా పాజిటివ్ వైబ్రేష‌న్. చాలా మంచి వ్య‌క్తిత్వ‌మున్న మ‌నిషి. ఆయ‌న షూటింగ్ ప్లేస్‌లో ఉంటే అంతా వైఫ్‌లాంటి ఎనర్జీ ఉంటుంది. బాల‌య్య సెట్‌లో హీరోయిన్ల‌తో చాలా స‌ర‌దాగా ఉంటారు.. ఎప్పుడూ కోప‌రేష‌న్ చేస్తుంటారు. నేను షూటింగ్ లేని స‌మ‌యంలో కూడా ఆయ‌న‌తో మాట్లాడేదాన్ని ఎన్నో గొప్ప విష‌యాలు ఆయ‌న ద‌గ్గ‌ర నేర్చుకున్నాను అన్నారు.

Leave a Reply

Your email address will not be published.