స్పై కెమెరా ల విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలి

సూక్షంగా ఉండే కెమెరాలను టాయిలెట్స్ లో షోరూంల లోని డ్రెస్సింగ్ రూమ్ ల లో హాస్టల్ గదులలో ఏర్పాటు చేస్తూ వీడియో లను సేకరిస్తూ మహిళలను మనోవేదనకు గురిచేస్తున్నారని హెవెన్ హోమ్ వ్యవస్థాపక రాలు వరలక్ష్మి అన్నారు. ఆదివారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యం లో జరిగిన ఒక కార్యక్రమం లో ” స్పై కెమెరాల వల్ల జరుగుతున్న అనర్ధాలు , వాటిని ఎదుర్కునేందుకు తెసుకోవాల్సిన జాగ్రత్తలు ” పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వరలక్ష్మి మాట్లాడుతూ రహస్యంగా అమర్చుతున్న కెమెరాల వల్ల దేశవ్యాప్తంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు… 

సూక్ష్మంగా ఉండే కెమెరాలను టాయిలెట్స్, షోరూమ్‌లలోని డ్రెస్సింగ్ రూమ్‌లు, హాస్టల్  దుల్లో ఏర్పాటు చేస్తూ వీడియోలను సేకరించి మహిళలను మనోవేదనకు గురిచేస్తున్నారని చెప్పారు. ఇలా సేకరించిన వీడియోలను చూపి లైంగిక దాడులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. ఇదే తరహాలో తీవ్రమైన మనోవేదనకు గురైన ఓ మహిళ బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లోనే ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. 
ఈ నేపథ్యంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న స్పైకెమెరాల విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని ఎంతో కాలంగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇలాంటి కేసుల్లో అరెస్టు అవుతున్న వారికి కేవలం రూ. 5వేలు జరిమానా కట్టి బెయిల్ పొందుతున్నారని అన్నారు. ప్రత్యేక లైసెన్సులు జారీచేసి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని విన్నవించామని తెలిపారు.స్పై కెమెరాలతో రహస్యంగా మహిళల వీడియోలను తీస్తున్న వారికి కఠిన శిక్షలు విధించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని తాము దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నట్టు చెప్పారు. 
తమ పోరాటానికి మద్దతు తెలపదలచిన వారు 8099259925 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని సూచించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు వాడుతున్న పిల్లలు వాటిని ఏవిధంగా ఉపయోగిస్తున్నారో ఆరా తీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.