రాశిఫ‌లాలు,


మేషం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఎల్.ఐ.సి పోస్టల్ ఏజెంట్లు టార్గెట్లను పూర్తి చేయగలుగుతారు. చీటికి మాటికి ఎదుటివారిపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది.

వృషభం : స్త్రీలకు తల, కాళ్లు, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ప్రముఖుల ప్రమేయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలమవుతాయి. ఖర్చులు మీ అంచనాలను మించడంతో ఒకింత ఇబ్బందులు తప్పువు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.

 మిథునం : రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. మీ సంతానం మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ప్రియతముల రాక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. స్థిర, బుద్ధి లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కర్కాటకం : బంధు మిత్రులతో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. పాత బాకీల వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
 సింహం : హోటల్, తినుంబడరాలు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు ఆరోగ్యపరంగా, ఇతరాత్రా చికాకులు వంటివి ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. సోదరి, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.

కన్య : చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి ఆశాజనకం. ముఖ్యుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఇతరులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ప్రమాదముంది జాగ్రత్త వహించండి.

 తుల : ఉన్నత స్థాయి అధికారులు ప్రలోభాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆలయాలను సందర్శిస్తారు. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ముఖ్యంగా, ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలున్నాయి.

వృశ్చికం : తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవడం క్షేమంకాదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు శ్రేయస్కరం కాదు. రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగలడంతో పొదుపు సాధ్యంకాదు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.

 ధనస్సు : ఆర్థికంగా మెరుగుపడతారు. వ్యాపార వర్గాల వారికి పనివారలతో చికాకులు తప్పవు. ప్రేమికుల విపరీత ధోరణి వల్ల సమస్యలెదురవుతాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలోనూ, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ వహించండి. ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది.

మకరం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, టెక్నికల్, ఇన్వర్టర్, ఏసీ వ్యాపాస్తులకు శుభదాకయంగా ఉంటుంది. శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగలుగుతారు. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్నవారు సైతం అనుకూలంగా మారతారు. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. రవాణా రంగాలలోని వారికి మెళకువ అవసరం.

కుంభం : వ్యాపారాభివృద్ధికి కావలసిన ప్రణాళికలు అమలు చేస్తారు. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు అన్ని విధాలా కలిసిరాగలదు. క్రయ విక్రయ రంగాల్లో వారికి ఆశాజనకం. స్థిరాస్తి అమ్మకం వాయిదా వేయడం మంచిది.
 
మీనం : భాగస్వాముల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఆదాయంలో చక్కని అభివృద్ధి కనిపిస్తుంది. పాత రుణాలు తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. గృహోపకరణ వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి.

Leave a Reply

Your email address will not be published.