టీచ‌ర్‌పై అత్యాచారం- న‌లుగురు అరెస్ట్‌

మధ్యప్రదేశ్‌లో ప్రైవేటు స్కూల్ టీచర్‌పై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. పోలీసులు అందించిన వివ‌రాల ప్ర‌కారం  ని సిధి జిల్లాలోని రాంపూర్ నైకిన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో గురువారం సాయంత్రం స్కూల్ లో త‌న బాధ్య‌త‌లు పూర్తి చేసుకుని 5.30 గంటల సమయంలో ఇంటికి ఒంటరిగా  వెళ్తున్న  టీచ‌ర్‌ను నలుగురు యువకులు  అడ్డగించిన నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌గా  ఆమె కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కి పైశాచికంగా ప్రవర్తించారు.  అత్యాచారం చేశారు.

మ‌ద్యం మ‌త్తులో ఉన్న వారి నుంచి   నుంచి తప్పించుకున్న బాధితురాలు  నేరుగా ఇంటికి వెళ్లి త‌న‌పై అఘాయిత్యం జ‌రిగిన విష‌యాన్ని కుటుంబసభ్యులకుచెప్ప‌డంతో  వారు  రాత్రి 8 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు  బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు అందించిన వివ‌రాల ప్ర‌కారం బచు లోనియా, విరు లోనియా, నరేంద్ర లోనియా, శివశంకర్ లోనియాల‌ను నిందితులుగా గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.ఈ ఘటనపై స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిందితుల‌ను ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.