సినిమా కోసం గుండు కొట్టించుకున్న బాలయ్యసినిమాల‌లో పాత్ర‌ల కోసం త‌న‌ని తాను మ‌ల‌చుకోవ‌టానికి సిద్ద‌ప‌డే నటసింహా నందమూరి బాలకృష్ణ ఏ పాత్ర చేసినా అందులో లీనమైపోయేలా  ఏం చేయడానికైనా సిద్ధపడతారు. సినిమా సినిమాకీ త‌న లుక్ మార్చుకుంటూ కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ వ‌స్తున్న బాల‌య్య   ‘రూలర్’ సినిమాలో ఐరన్ మ్యాన్ లుక్‌తో  స్టైలిష్‌గా కనిపించి క‌ట్టిప‌డేసారు. తాజాగా వైట్ అండ్ వైట్ ఖద్దరు దుస్తుల్లో గుండు, గుబురు మీసాలతో బాలయ్య క‌నిపించి… అదిరిపోయిందీలుక్ అనిపించుకున్నాడు.

 విగ్గుల‌తో నెట్టుకొచ్చి, త‌మ హెయిర్ స్టైల్‌ని కాపాడుకుంటున్న  పాత్ర కోసం గుండు చేయించుకున్న స్టార్ హీరోలు ఈ మధ్యకాలంలో లేరనే చెప్పాలి. తెలుగునాట ఇలా సాహ‌సంచేసే హీరోలు దాదాపు లేరు.  బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్ర‌స్తుతం చేస్తున్న‌ సినిమా కోసమే ఈ గెట‌ప్ అని ఫిలింన‌గ‌ర్ టాక్   కొత్త లుక్‌తో ఉన్న‌ బాలయ్య  ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  బాలయ్యను పవర్‌ఫుల్‌గా గత రెండు చిత్రాల్లో  చూపించిన బోయపాటి తాజా చిత్రంలోనూ  ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి పెర‌గిపోతోంది స‌ర్వ‌త్రా.  బోయపాటి మరోసారి తన మార్క్‌ను చూపించేలా ఉండ‌టంతో సినిమా మీద అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.   
 

Leave a Reply

Your email address will not be published.