ప‌వ‌న్‌… న‌డ్డా బంద‌రు ల‌డ్డూలిచ్చాడా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై  సీపీఐ నాయకుడు రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తమతో పొత్తు పెట్టుకొని ఇప్పుడు ఎలా బీజేపీకి దగ్గరవుతారని విమర్శించారు. బీజేపీతో ఎందుకు కలుస్తున్నారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి పాచిపోయిన లడ్డూలను ఇచ్చిందంటూ బీజేపీని గతంలో పవన్ విమర్శించారని… ఢిల్లీలో నడ్డాను కలిసిన తర్వాత పవన్ కు బందరు లడ్డూలు ఇచ్చారా? అని ప్రశ్నించారు.
పవన్ ఏమొహం పెట్టుకొని బీజేపీకి దగ్గరయ్యారని అదే పార్టీని విమర్శించి మళ్లీ అదే పార్టీతో ఎలా కలిశారని ప్రశ్నించారు. పవన్‌లో నీతి నిజాయతీ ఏమయ్యాయని మండిపడ్డారు. చేగువేరా తనకు ఆదర్శమని చెప్పుకునే పవన్ ఇప్పుడు బీజేపీ చెంగు కప్పుకున్నారని దుయ్యబట్టారు. పవన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published.