గోడ మీద వార్తలు

01 . త్వరలో దేశంలో ఎక్కడ నుండైనా ఓటేసే అవకాశం కల్పించే ఆలోచనలో – ఎన్నికల కమిషన్ …
బయోమెట్రిక్ సిస్టం పెట్టి థంబ్ ఇంప్రెషన్ తో ఎవడూ హ్యాక్ చేయలేని ఓ మొబైల్ యాపు ద్వారా ఓటేసే సిస్టం తెండి సామీ – జనాలు ఇంట్లో ఆఫీసుల్లో కూర్చొని ఓటేస్కోవచ్చు …!!
02. ఏపీలో కోళ్ళ కి కొత్త వైరస్ – పలుచోట్ల వారం పాటూ చికెన్ అమ్మకాలు నిషేధం …
ఓ నెల నోరు కట్టుకోండ్రా సామీ – కక్కుర్తి పడితే బతుకు నోట్లో వైరెట్టుకున్న చిన్నారావైపోద్ది …!!
03. నిర్భయ కేసులో నిందితులని శిక్షించడానికి అడ్డం పడుతున్న హాక్కులు – బాధితులమైన మాకు ఉండవా అని ప్రశ్నించిన – నిర్భయ తల్లి …
ఇక్కడంతే తల్లీ – ఎదవలకున్న సౌకర్యాలు సగటు జనాలకి ఉండవు – మన పుస్తకాలు మస్తిష్కాలు అంతలా తగలడ్డాయి మరి …!!
04. లక్షల్లో సంపాదిస్తున్నారు – విదేశీ కార్లు దిగుమతి చేస్కుంటున్నారు – కానీ టాక్స్ కట్టటానికి ముందుకు రావాటం లేదు – టాక్స్ కట్టే వారి సంఖ్య పెరగాలి – మోడీ …
అంబానీ అంతటోడే ఫారిన్ కారు స్టాఫ్ పేరుతో కొని సెకండ్ హ్యాండు రిజిష్ట్రేషన్ చేసి టాక్సు ఎగ్గొడితే ఏం పీకలేని పొజిషను మనది – ఏటి సేత్తాం ..!!
05. ఢిల్లీలో మోడీని కలిసిన జగన్ – సుమారు 50 నిమిషాల పాటూ సాగిన చర్చలు …
ఓ గంట సమయాన్ని ఒక సీయమ్ముకి కేటాయించేటంత తీరుబాటుగా ప్రధాని ఉండటం మెచ్చుకోవాల్సిన అంశం …!!
మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!! 
“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ” 

Leave a Reply

Your email address will not be published.