ఇలియానా కి హిందీ సినిమా మాత్రమే ఉంది

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్టేటస్‌లో ఉన్నప్పుడే ఇలియానా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అడపా దడపా అవకాశాలను దక్కించుకుంటు ప్రేమలో పడింది. అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో బ్రేక్ అప్ కావటంతో ఆమెను పట్టించుకునేవారు కరువైయ్యారు. తెలుగులో అవకాశాల కోసం ట్రై చేసినా, నిర్మాతలు ఇలియానాని పట్టించుకోలేదు.
ఈ ఏడాది ఆమె నటించిన పాగల్ పంతి విడుదలై ఫ్లాప్ కావటంతో బాలీవుడ్‌లోనూ ఇలియానా పనైపోయిందనుకున్నారంతాప ఇప్పుడు ఆమె చేతిలో ఒకే ఒక హిందీ సినిమా మాత్రమే ఉంది.
ఇలాంటి తరుణంలో ఆమెకు తమిళంలో స్టార్ హీరో అజిత్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ లో ఒకరిగా ఛాన్సొచ్చిందట. యామీ గౌతమితో పాటు హీరోయిన్గా ఇలియానాని తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఒకటో రెండో తమిళ చిత్రాల్లో నటించిన ఇలియానా తెలుగుకే పరిమితమైంది. ఇప్పుడు తిరిగి మళ్లీ తమిళంలోకి అడుగు పెడుతుంది. మళ్లీ ఇలియానా కెరీర్ స్పీడు అందుకుంటుందోలేదో చూడాలి.