మూడు కోతుల బొమ్మలను ఆసక్తికరంగా పరిశీలించిన ట్రంప్

‘చెడు వినకు.. చెడు అనకు.. చెడు కనకు అనే గాంధీ సిద్దాంతాన్ని జనంలోకి తీసుకువచ్చిన మూడు కోతుల బొమ్మలను ట్రంప్ దంపతులు ఆసక్తికరంగా పరిశీలించారు. సోమవారం వారిరువురూ తమ భారత పర్యటనలో భాగంగా గాంధీజీ సబర్మతీ ఆశ్రమాన్ని కలియదిరిగారు. ఈ సందర్భంగా కనిపించిన మూడు కోతుల బొమ్మలను ఆశ్చర్యంగా చూస్తూ, ఇందుకు సంబంధించిన విశేషాలను ప్రధాని మోడీని అడిగి తెలుసుకున్నారు.
ఈ కోతి బొమ్మలకు అర్థం… ‘, మనుషులు జీవితాంతం సత్యాన్నే పాటిస్తూ, చెడుకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే గాంధీజీ ఆ కథను ప్రచారంలోకి తీసుకొచ్చారని ట్రంప్ దంపతులకు మోడీ ఈ సందర్భంగా వివరించారు. ఈమూడు కోతుల కథ 17వ శతాబ్దంలో జపాన్ లో పుట్టిందని అయితే . గాంధీజీ ద్వారానే పాపులర్ అయిందని, ఇప్పటికీ భారత జనజీవనంలో ఈ మూడు కోతుల ప్రాధాన్యత ఎంతో ఉందని వారికి వివరించారు మోడీ.