ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌తో నాగ‌చైత‌న్య

 ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నాగ‌చైత‌న్య – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా  తెర‌కెక్కిస్తోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ఆరంభం కానుంద‌ని సమాచారం.కాగా ఈ  చిత్రానికి ‘నాగేశ్వ‌ర‌రావు’ అనే పేరు ఖ‌రారు చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్‌లో తెగ‌ ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా  `గీత గోవిందం` సెంటిమెంట్‌తో ఈ సినిమాలోనూ ర‌ష్మిక‌నే తీసుకోవాల‌ని నిర్మాత‌లు యోచిస్తున్న‌ట్టు తెలియ‌వ‌చ్చింది. 
 మ‌రోవైపు ఈ సినిమాలో  క‌థానాయిక పాత్ర‌కు ఉన్న  ప్రాధాన్యత దృష్య్టా  ఓ స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుంద‌ని అందుకు   అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించే నాయిక    కీర్తి సురేష్ పేరు కూడా బ‌లంగా వినిపిస్తోంది.   ప్ర‌స్తుతం ‘ల‌వ్ స్టోరీ’ సినిమాతో బిజీగా  ఉన్న చైతు. పూర్తి సాంకేతిక నిపుణులు, న‌టీన‌టులు ఖ‌రారు చేయ‌గానే   `నాగేశ్వ‌ర‌రావు` ని ర‌డీ చేసేందుకు సిద్దం అవుతున్న‌ట్టు స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published.