బాల‌య్య తో చేయ‌న‌న్న త‌మ‌న్నా

ఆ మధ్య తమన్నా జోరు కాస్త తగ్గినా, ‘ఎఫ్ 2’ సినిమా నుంచి  కెరియర్ మళ్లీ ఊపందుకునేలా చేసుకుంది.. ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాతో భారీ విజయాన్నే అందుకోవ‌టంతో మ‌రి నాలుగైదేళ్లు త‌న‌కు ఎదురేలేద‌ని భావిస్తున్న ఈ అమ్మ‌డుకు తాజాగా బాలకృష్ణ సరసన చేసే ఛాన్స్ లభించింది. . చిరంజీవితో భారీ సినిమా చేసిన ఆమె బాల‌య్య‌తోనూ సై అంటుంద‌ని అంతా అనుకున్నా తిర‌స్క‌రించి అంద‌రినీ ఔరా అనిపించింది. 
బోయపాటి – బాలకృష్ణ కాంబినేషన్లో  వస్తున్న సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు అంతా సిద్దం చేసుకున్నారు. ఈ చిత్రంలో న‌టీ న‌టుల ఎంపిక కూడా దాదాపు పూర్తయ్యింది కూడా .అయితే  ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించేందుకు తొలుత తమన్నాను సంప్ర‌దించాడ‌టం బోయ‌పాటి. ప‌లు ప‌ర్యాయాలు త‌న చుట్టూ తిప్పుకుని తీరా క‌థ విని, పారితోష‌కం కూడా మాట్లాడుకున్నాక ష‌డ‌న్‌గా త‌ను ఆ సినిమాలో న‌టించ‌బోన‌ని బొయ‌పాటికే ఫోన్ చేసి చెప్పేసిందంట త‌మ‌న్నా.  నిజానికి బాలకృష్ణ సినిమాకి నో చెప్పేంత బిజీగా తమన్నా ఉందా? అంటే అదీలేదు.  మరి  ఆమె ఎందుకు ఈ సినిమాని కాద‌నుకుంద‌న్న‌ది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.  ఈ విష‌యంలో అటు త‌మ‌న్నా కానీ, ఇటు బోయ‌పాటికానీ క్లార‌టీ ఇస్తారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.