మ‌హేష్ క‌థ‌తోనే బ‌న్ని- సుక్కూ!!

మ‌హేష్ – సుకుమార్ క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌ల్ల ఈ సినిమా చేయ‌డం లేద‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. సుకుమార్ సైతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాన‌ని ఏఏ 20 ప్రాజెక్టును ఖాయం చేసుకున్నారు. అయితే మ‌హేష్ తో సుకుమార్ టెర్మ్స్ ఎలా ఉన్నాయి? అన్న గంద‌ర‌గోళం అభిమానుల్లో నెల‌కొంది. దీనికి తాజాగా పూర్తి క్లారిటీ వ‌చ్చేసింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. మ‌హేష్ .. సుకుమార్ మ‌ధ్య ఎలాంటి విభేధాలు లేవు.. కేవ‌లం క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ మాత్ర‌మే. దీంతో సుకుమార్ ఫ్రెష్ మైండ్ తో త‌దుప‌రి ప్రాజెక్టుల‌పైనా దృష్టి సారిస్తున్నారు. చెన్న‌య్ లో ఈ వారంతంలో మ‌హేష్ తో జ‌రిగిన మీటింగ్ తో అన్ని విష‌యాల‌పైనా సుకుమార్ కి క్లారిటీ వ‌చ్చేసింద‌ని తెలుస్తోంది. దీంతో సుకుమార్ ఓవైపు బ‌న్ని సినిమా గురించి ప‌ని చేస్తూనే, త‌న శిష్యుల ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. బ‌న్నితో ఎప్ప‌టి నుంచి సెట్స్ పైకి వెళ‌తారు? అన్న‌దానిపైనా క్లారిటీ వ‌చ్చేసింది. జూన్ జూలై నాటికి అల్లు అర్జున్ స్క్రిప్ట్ రెడీ అయిపోతుంది. అటుపై అక్టోబ‌ర్ నుంచి సెట్స్ కెళ్లేందుకు ఈ జోడీ రెడీ అవుతోంది. మ‌హేష్ కి వినిపించిన స్క్రిప్టుతోనే సుకుమార్ – బ‌న్ని సెట్స్ కి వెళుతున్నారు. అయితే బ‌న్నికి త‌గ్గ‌ట్టు స్క్రిప్టులో చిన్న‌పాటి మార్పులు ఉంటాయి. దానికోస‌మే ఈ రెండు నెల‌ల స‌మ‌యం ప‌డుతోంది. సుకుమార్ తాజా సినిమాకి సంబంధించి మ‌రిన్ని  వివ‌రాలు బ‌న్ని బ‌ర్త్ డే ఏప్రిల్ 8న రివీల్ చేసే ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published.