దిల్‌రాజు న‌మ్మ‌క‌మేంటో

టాలీవుడ్‌ స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్‌రాజు ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. ఆ రెండు సినిమాలు తమ బ్యానర్‌లో నిలిచి పోయే సినిమాలు అవుతాయంటూ దిల్‌రాజు చాలా నమ్మకంగా ఉన్నారు. మహేష్‌బాబుతో నిర్మిస్తున్న ‘మహర్షి’ చిత్రం మరియు త్వరలో ప్రారంభించబోతున్న ’96’ చిత్రం రీమేక్‌ పై దిల్‌రాజు చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. ఇటీవల ఒక మీడియా సమావేశంలో దిల్‌రాజు మాట్లాడుతూ మా బ్యానర్‌లో రాబోతున్న ఈ రెండు సినిమాలు తప్పకుండా అందరిని ఆకట్టుకుంటాయి. తమ బ్యానర్‌ స్థాయిని కూడా పెంచుతాయని చెప్పుకొచ్చారు.

దిల్‌రాజు సినిమా నిర్మిస్తున్నారు అంటే డిస్ట్రిబ్యూటర్లు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. కాని ఈ రెండు చిత్రాల విషయంలో మాత్రం దిల్‌రాజు అతిగా స్పందిస్తున్నట్లుగా అనిపిస్తోంది. వరుసగా మహర్షి చిత్రం గురించి పదే పదే చెప్పడంతో పాటు, తప్పకుండా మా సినిమా ఆకట్టుకుంటుందని చెప్పడం కాస్త ఆలోచనను లేవనెత్తుతోంది.

సన్నిహితులు మరియు డిస్ట్రిబ్యూటర్ల వద్ద మాట్లాడుతూ ‘మహర్షి’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ దిల్‌రాజు చెప్పుకొచ్చార‌ట. తనకు సన్నిహితంగా ఉండే వారితో ఛాలెంజ్‌ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి దిల్‌రాజు మహర్షిపై చూపుతున్న నమ్మకంకు సినీ వర్గాల వారు కూడా ఒకింత ఆశ్చర్యంను వ్యక్తం చేస్తున్నారు. మరి దిల్‌ రాజు నమ్మకం నిలిచేనా చూడాలి. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.