గోడ మీద వార్తలు

గోడ మీద వార్తలు                                                                 10 – 01 – 2019

01 నాపై చేతబడి జరిగింది – అందుకే సౌతాఫ్రికా సిరీస్ లో గాయంతో మధ్యలోనే స్వదేశానికి తిరిగి రావలసి వచ్చింది – పాక్ క్రికెటర్ – సోహైల్ …

సిన్నప్పుడు సరిగా వీధి బడికి ఎళ్ళకపోతే ఇట్టాంటి సేతబడి ఆలోచనలే వస్తాయ్ – ఎదవ మంగళారం స్టేట్మెంట్లూ మీరూ…!!

02. పన్నెండు కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ రాజకీయ వ్యవస్థని మారుస్తాననటం హాస్యాస్పదం – సోమిరెడ్డి ….

ఏళ్ళ తరబడి కేసులు నానుస్తా ఉంటే మారుస్తాననే నమ్మకం ఎవుడిలోనన్నా పెరుగుద్దిలే సామీ – పడితే గిడితే పీకలేనోళ్ళు సిగ్గుపడాల గానీ – శుక్రారానికీ ఎందుకు సిగ్గు…!!

03. మోడీ బయోపిక్ తీస్తే ఆ పాత్రలో నాకంటే బాగా ఎవరూ నటించలేరు – పరేష్ రావల్ ….

ఎళ్ళెళ్ళవోయ్ – నిజ జీవితంలో మనోడిని మించి నటించేటోడెవడూ లేడని బయట్టాకు – కావాలంటే ఎర్ర కృష్ణుడి ని అడుగు …!!

04. భారతదేశ ఆర్ధిక ప్రగతికి నోట్ల రద్దు – జీయస్టీ పెద్ధ గండికొట్టాయని ఆర్ధిక నివేదికలో తెల్పిన – ప్రపంచ బ్యాంకు …

సాము చేయరాని సమురాయ్ కత్తిస్తే సంకలు కోసేసుకున్నాడని – కొత్త సామెత…!!

05. కేంద్రం తీసుకొస్తున్న పౌరసత్వ బిల్లుకి నిరసనగా అసోంలో ముగ్గురు మంత్రులు రాజీనామా – భాజపా తో సోం గణపరిషత్ తెగదెంపులు …

స్నేహితులని సంపాదించుకోటం ఎంత సులువో – ఆళ్ళని నిలబెట్టుకోవటం అంత కష్టం – మంచి చేయాలనుకున్నప్పుడు సంకనాకించే చాదస్తాలు – మనోభావాలు మడిచి దాచేయాలి – లేపోటే మట్టే.. !!

మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!! 

Leave a Reply

Your email address will not be published.