ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు పరిశీలకులు వీరే…


ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు 13 జిల్లాల పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియ‌మిస్తూ, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మంగ‌ళ‌వారం ఆదేశాలు జారీ చేసింది.  రాష్ట్ర పంచాయితీ ఎన్నిక‌ల‌లో ఇటీవ‌ల ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన స‌రికొత్త నిబంధ‌న‌ల అమ‌లు, మ‌ద్యం, డ‌బ్బు పంపిణీపై వీరు ప్ర‌ధానంగా దృష్టి సారిస్తారు. ఇక ప‌రిశీల‌కులుగా నియ‌మితులైన  అధికారులు ఎవ‌రంటే…
(1) కె. ఆర్.బి. హెచ్. ఎన్. చక్రవర్తి – కర్నూలు జిల్లా. 
(2) ఎం. పద్మ – కృష్ణ జిల్లా.  
(3) పి.ఉషా కుమారి – తూర్పు గోదావరి జిల్లా.  
(4) పి.ఎ.  శోభా – విజయనగరం జిల్లా.
(5) కె. హర్షవర్ధన్ – అనంతపురం జిల్లా. 
(6) టి. బాబు రావు నాయుడు –  చిత్తూరు జిల్లా. 
(7) ఎం. రామారావు –  శ్రీకాకుళం జిల్లా.  
(8) కె. శారదా దేవి – ప్రకాశం జిల్లా. 
(9) ప్రవీణ్ కుమార్ – విశాఖపట్నం జిల్లా.
(10) బి. రామారావు -ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా.
(11) పి. రంజిత్ బాషా – వైయస్ఆర్ కడప జిల్లా.
(12) కాంతిలాల్ దండే – గుంటూరు జిల్లా. 
(13) హిమాన్షు శుక్లా –  పశ్చిమ గోదావరి జిల్లా.

వీరికి అదనంగా  సిహెచ్.  శ్రీధర్, జి. రేఖ రాణి, టి.కె.రామమణి, ఎన్.ప్రభాకర్ రెడ్డి  నలుగురు సీనియర్ ఉన్నతాధికారులను లను రిజర్వు లో ఉంచిన ట్టు ఈ సీ ప్ర‌క‌టించింది. 

Leave a Reply

Your email address will not be published.