అతి చిన్న వయసులో నోబుల్ బహుమతి పొందిన మలాలా ఎందరికో స్ఫూర్తి

పాకిస్తాన్ లో బాలికల విద్యపై విస్త్రత ప్రచారం చేస్తున్న మలాలా తాలిబాన్లకు టార్గెట్ అయిన విషయం విదితమే. ఆమెను చంపేందుకు ఉగ్రవాదులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఆమెపై హత్యాయత్నం కూడా జరిగింది. అయితే ఆమె అదృష్టవశాత్తూ ఆ ప్రయత్నం నుంచి బతికి బయటపడటంతో పాటు, అంతటితో తన ప్రయత్నాలు మానుకోకుండా బాలికలు చదువుకుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్న ప్రచారం ఆరంభించారు. ఇది మరింత నలుసుగా మారింది ఉగ్ర కళ్లకి.. ఈ క్రమంలోనే ఆమె అత్యంత ప్రతిష్టాకర నోబెల్ని కూడా అందుకున్నారు. బాలికల విద్యకు బ్రాండ్ అంబాసిడర్ గా మలాలా మారిపోయిందటే… సందేహం లేదు.
స్ఫూర్తిదాయకమైన మలాలా యూసఫ్జాయ్ జీవిత చరిత్ర ను తెరకెక్కించే ప్రయత్నం దాదానె పూర్తి కానిచ్చాడు దర్శకుడు హెచ్ ఇ అంజాద్ ఖాన్. ఈ మలాలా బయోపిక్కు గుల్ మకాయ్ అని పేరు పెట్టాడు. ఈ చిత్రం ప్రారంభం నుంచి బెదిరింపులు వస్తున్నా చిత్రాన్ని పూర్తి చేస్తున్న దర్శకుడిపై ఫత్వా జారీ అయింది.
ఈ చిత్రంలో వెనుక బాంబులు పేలుతుంటే చేతిలో ఒక పుస్తకం పట్టుకుని ఉన్న మలాలా తో కూడిన వాల్ పోస్టర్ ఈ మధ్య విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే నోయిడా కు చెందిన ఒక ముస్లిం మత ప్రబోధకుడు దీనిని తప్పు పడుతూ మలాలా చేతిలో ఉన్న పుస్తకం ఖురాన్ అని, ఖురాన్ కు అపచారం చేఐఆఉంటూ దర్శకుడికి ఫత్వా జారీ చేశారు. అయితే ఇందులో మలాలా చేతిలో ఉన్నది ఖురాన్ కాదని, ఓ వైపు బాంబులు పడినా బాలికలు చదువు కోవాలని చెప్పేలా మలాలా చేతిలో ఇంగ్లీష్ పుస్తకం ఉందని గగ్గోలు పెడుతున్నాడు చిత్రం దర్శకుడు మరేం జరగనుందో చూడాలి.