‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమం సూపర్ స్టార్ రజినీకాంత్

ఆ మధ్య ప్రధాని మోడీ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఆకట్టుకోగా… ఇప్పుడు ఈ అవకాశం దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ ని వరించింది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్నఈ కార్యక్రమం త్వరలోనే డిస్కవరీ ఛానల్లో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేస్తూ, 15 సెకన్ల మోషన్ వీడియోను బేర్‌గిల్స్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు . ఇవి సామాజిక మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇప్పటివరకూ ఎంతో మంది స్టార్స్‌తో పని చేశా, . రజినీకాంత్ గొప్ప స్టార్ అని.. అలాంటి వ్యక్తితో సమయం గడపడం.. అలాగే సరికొత్త రజినీ గురించి తెలుసుకోవడం.. చూడటం చాలా హ్యాపీగా ఉందని, ఆతనితో నిర్వహించిన ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమం మాత్రం తనకు చాలా ప్రత్యేకమైందని, ..‘లవ్ ఇండియా’ అంటూ బేర్‌గిల్స్ ట్వీట్ చేశాడు. గిల్స్ ట్వీట్‌ను రజనీ వీరాభిమానులు పెద్ద ఎత్తున లైక్ చేస్తూ షేర్ల వర్షం కురిపిస్తు, వైరల్ చేస్తున్నారు.