మండలి కార్యదర్శి సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం..?


రానున్న బడ్జెట్ సమావేశాలలోశాసనమండలి కార్యదర్శి పై సభాహక్కుల ఉల్లంఘన కింద తీర్మానంపెట్టి కఠినచర్యలుతీసుకుంటామని అన్నారు టిడిపి ఎమ్మెల్సీ యలమంచిలిబాబూ రాజేంద్రప్రసాద్. గురువారం ఆయ‌న విజయవాడలో శాసన మండలి చైర్మన్ షరీఫ్ స్వగృహానికి వ‌చ్చి కాసేపు మాట్లాడారు.

అనంత‌రం ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ మీడియాలో మాట్లాడుతూ క‌ట్టుబ‌ట్ట‌ల‌తో రాజ‌ధాని లేక రాష్ట్రం న‌డిబొడ్డున దీనంగా నిల‌బ‌డిన‌ప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకోసం, రాజధానిగా అమరావతి ఏర్పాటును హ‌ర్షిస్తూ, వార‌స‌త్వంగా వ‌చ్చిన వేలాది రూపాయ‌లు విలువ చేసే తమ భూములు ఇచ్చిన రైతులను అప‌హాస్యం చేసేలా పెయిడ్ ఆర్టిస్టులంటూ వ్యంగ్య‌వ్యాఖ్య‌లు చేస్తున్న నేత‌లు త‌క్ష‌ణం చెంప‌లేసుకుని క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసారు.

నీతి నిజాయితీలతో వ్య‌వ‌హ‌రించే మండ‌లి చైర్మ‌న్ ష‌రీఫ్‌పై అధికారపక్షం చాలా వత్తుడులను తీసుకువ‌చ్చింద‌ని, టిడిపి ఎమ్మెల్సీల‌ను ప్ర‌లోభ పెట్టింద‌ని అన్నారు. అయితే తలవగ్గని ష‌రీఫ్ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించి మూడు రాజదానుల బిల్లులను సెలెక్ట్ కమిటీ పంపించారు అని రాజేంద్రప్రసాద్ గారు అన్నారు.

శాస‌న‌స‌భ‌లో స్పీక‌ర్‌కి ఎంత విలువ ఉంటుందో అంతే విలువ మండ‌లి చైర్మ‌న్‌కి కూడా ఉంటుంది. ఆత‌ని ఆదేశాలను తూచా తప్ప కుండా అమలు చేయ్యాల్సిన బాధ్య‌త మండలి కార్యదర్శిదే. అయినా అధికార పార్టీ వ‌త్తిళ్ల‌తో కార్య‌ద‌ర్శి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బిల్లుల‌పై క‌మిటీ వేసే హ‌క్కుభంగం వాటిల్లేలా ప్రవ‌ర్తిస్తున్న‌ మండలి కార్యదర్శి పై రాబోయే బడ్జెట్ సమావేశాలలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.


Leave a Reply

Your email address will not be published.