రాజ‌ధాని రైతుల‌కు అండ‌గా సింగ‌ర్ స్మిత‌…


ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిని మూడు ముక్క‌లు చేస్తుండ‌టంపై  అమరావతి రైతులు చేస్తున్న‌ ఉద్యమానికి దాదాపు అన్ని పార్టీలు బాస‌ట‌గా నిలుస్తున్నాయి . ధర్నాలు, ర్యాలీలు, దీక్షలతో రైతులు, మహిళలు ఆందోళన ల‌తో  రాజ‌ధాని ప్రాంతం ద‌ద్ధ‌రిల్లుతోంది. గత 23 రోజులుగా దాదాపు 29 గ్రామాల ప్రజలు చేస్తున్న ఉద్యమం క్ర‌మ‌క్ర‌మంగా వేడెక్కుతోంది. చివ‌ర‌కి అధికార పార్టీల నేత‌లు భారీగా పోలీసులు ఉంటే కానీ అమ‌రావ‌తి ప్రాంతంలో తిర‌గ‌లేని ప‌రిస్థితి.

తాజాగా  ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖ సింగర్, నటి స్మిత   రైతులకు మద్దతు తెలుపుతూ అమరావతి రైతులకు అండగా నేను ఉన్నాను. మీకు న్యాయం జరగాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. మీ బాధను పంచుకుంటున్నాను. వాళ్లకు అండగా నిలబడితే ఏమైనా చేయొచ్చు’ అంటూ ట్వీట్ చేసింది.  రాజధాని ప్రాంత రైతుల వేదన చేస్తుంటే గుండె బద్దలౌతోంది. ఆ బాధ తట్టుకోలేనిది. రైతుల పట్ల అస్సలు సానుభూతి చూపించడకుండా, మేం బాగానే ఉన్నాం కదా ఎవరికో ఏదో జరిగితే మాకేంటి అనుకునే నాయ‌కుల‌ని చూస్తుంటే చాలా బాధనిపిస్తోందంటూ త‌న ట్వీట్ల‌తో త‌న ఆవేద‌న‌ని వ్య‌క్తం చేసారు.మ‌రోవైపు రాజ‌ధాని అంశంపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల‌లో విప‌క్ష నేత‌ల అరెస్టుల ప‌రంప‌ర సాగిస్తోంది రాష్ట్ర ప్ర‌భుత్వం.

Leave a Reply

Your email address will not be published.