రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా…


జాతీయ అవార్డ్‌, ఫిలింఫేర్ అవార్డుల‌ను సొంతం చేసుకున్న రాజ్ కందుకూరి నిర్మాత‌గా ధ‌ర్మ‌ప‌థ క్రియేష‌న్స్ ప‌తాకంపై త‌న కుమారుడు శివ కందుకూరి ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ రూపొందించిన చిత్రం ‘చూసీ చూడంగానే`. ద‌ర్శకురాలుగా శేష సింధు ఈ చిత్రం ద్వారా ప‌రిచ‌యం అవుతున్నారు. 

జనవరి 31న . సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా విడుద‌ల‌వుతున్న ఈ సినిమాలోని పాటు ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల చెవుల‌ను వీనుల విందు చేస్తున్నాయి. అన్ని మాధ్యమాల్లో కలిపి 25 మిలియన్స్ వ్యూస్ సాధించింది అంటే ఈ పాట‌లు ఎంత బాగున్నాయో అర్ధం చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ప్లాటినం డిస్క్ ను అందుకున్న సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో చిత్ర యూనిట్ ఓ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్యేకంగా నిర్వ‌హించింది ..

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – “జనవరి 31న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నామ‌ని, మ‌ధురా ఆడియోద్వారా విడుద‌లైన పాట‌ల‌న్నీ అద్భుత రెస్పాన్స్ అందుకున్న‌ట్టు చెప్పారు. సంగీత సారథ్యం వ‌హించిన గోపి సుందర్ ధ‌న్య‌వాదాలు చెప్పారు. ఈ మూవీ ఒక అందమైన ప్రేమకథ. ఔట్‌పుట్ చాలా బాలా వ‌చ్చింది. తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.” అన్నారు.

హీరో శివ కందుకూరి మాట్లాడుతూ – న్యాచురల్ స్క్రిప్ట్. ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ద్వారా నన్ను హీరోగా పరిచయం చేస్తున్న మా నాన్న రాజ్ కందుకూరి గారికి, మా దర్శకురాలు శేష సింధు రావు గారికి స్పెషల్ థాంక్స్” అన్నారు.

దర్శకురాలు శేష సింధు మాట్లాడుతూ – నేను మ్యూజిక్ లవర్ ని. అందుకే నాకిదితొలి చిత్రం అయినా టాప్ ర‌చ‌యిత‌ల‌తో ద‌గ్గ‌రుండి స‌న్నివేశాలు చెప్పి మ‌రీ రాయించుకున్నా… వాళ్లు చాలా సపోర్ట్ చేసి మంచి పాటలను అందించారన్నారు. . రెండు గంటల పాటు తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు” అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత మ‌ధుర శ్రీ‌ధ‌ర్‌, ర‌చ‌యిత అనంత శ్రీ‌రామ్‌, చిత్ర క‌థానాయిక‌లు వర్ష బొల్లమ్మ , మాళవిక మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published.