అలుపెరగని అమరావతి ఆందోళనలు
మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటన రాజధాని అమరావతిలో నిరసన సెగలు రాజేసింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అమరావతిలో రైతుల నిరసనలురోజుకో రూపాన్ని తీసుకుంటున్నాయి. నిన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కనిపించడం లేదని, వెతికి పెట్టాలని, మూడు రాజధానుల ప్రకటనపై తాము ఏదైన చెప్పుకొందామంటే మా ఎమ్మెల్యే ఎక్కడున్నారో కనిపించడం లేదని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ఎమ్మెల్యేను మాకు అప్పగించండి అంటూ రైతులు ఫిర్యదులో పేర్కొనగా తాజాగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపిండంలేదంటూతుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో కొందరు మహిళా రైతులు ఫిర్యాదు చేశారు. మరోవైపు తుళ్లూరులో రైతులు నల్ల దుస్తులు ధరించి ధర్నా చేస్తు మా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించడం లేదని, తమ నియోజకవర్గంలోని రైతులు ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడంలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుళ్లూరులో టెంట్ వేసి రైతులు నిరసన తెలియజేస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి అనుమతులు లేవంటూ పోలీసులు టెంట్ పీకేయటంతో ఈ రోజు నుంచి మహాధర్నా చేస్తున్నట్టు రైతాంగం ప్రకటించింది.
మరోవైపుఅచ్చంపేట-సత్తెన్నపల్లి రోడ్డుపై రైతులు అర్ధనగ్నంగా భైఠాయించగా. మందడం ప్రధాన రహదారిపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇసుక, ఉల్లిపాయలతో రైతుల వినూత్న నిరసన చేపట్టారు.
మరోవైపు అమరావతి వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యక్తిగతంగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను స్వాగతిస్తున్నానని, విశాఖ ప్రాంతానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అయితే రాజధాని అమరావతి రైతుల ఆందోళన సహేతుకమైనదే నంటూ మద్దతు పలికారు. రాజధాని రైతులకు ఎలా న్యాయం చేస్తారో ప్రభుత్వం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
మరోవైపు అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉండడం వల్ల రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉంటుందని తెలిసినా జగన్ సొంత కారణాల వల్ల రాజధానిని మూడు ముక్కలు చేయడం భావ్యం కాదని లాయర్లు అంటున్నారు. రాజధానితో పాటు హైకోర్టును కూడా అమరావతిలో కొనసాగించాలన్న డిమాండ్‌తో విజయవాడ లాయర్లు తమ విధులను బహిష్కరించి నిరసన ర్యాలీ చేపట్టారు.