‘మిస్ ఇండియా’ గా వస్తున్న ‘మహానటి’జాతీయ నటిగా అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు తెలుగులో ఓ హీరోయిన్‌కు ఇంతగా నటించే స్కోప్ ఉంటుందా అని తెలిసేలా చేసిన సినిమా ‘మహానటి’ . కీర్తి సురేష్ కెరీర్‌లోఈ సినిమా అద్భుత విజ‌యాన్ని అందుకోవ‌టంతో పాటు జాతీయ అవార్డును కూడా ద‌క్కించుకుంది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ కీర్తీని వరస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వ‌రించాయి.
మ‌రోమారు త‌న ప్ర‌తిభ చూపిస్తూ ‘మిస్ ఇండియా’ అనే సినిమా తో జ‌నం ముందుకు వ‌స్తోంది కీర్తి. ఇందులో కధానుగుణంగా కొన్ని భిన్నమైన గెటప్స్‌లో కనిపించాల్సి రావ‌టంతో కీర్తీ తెగ క‌ష్ట‌ప‌డ‌ట‌మే కాదు ఓ కారెక్టర్ కోసం బరువు కూడా చాలా తగ్గిపోయింది . తాజాగా ఈ మూవీని ఏప్రియ‌ల్ 17న విడుద‌ల చేస్తున్న‌ట్టు ఈ చిత్ర‌ ప్రొడ్యూసర్ మ‌హేష్ ఎస్‌.కోనేరు రిలీజ్ డేట్ ను ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మ‌రి ఈ సినిమా మ‌హాన‌టి రికార్డుల‌ను అందుకుంటుందో లేదో చూడాలి.
 

Leave a Reply

Your email address will not be published.