పెళ్లాన్ని ఒళ్ళంతా ఐర‌న్ చేసిన శాడిస్ట్ మొగుడు!

మ‌హిళ‌ల పై దారుణాలు ఎక్కువ‌వుతున్న నేప‌ధ్యంలో క‌ట్టుకున్న భ‌ర్తే భ‌ర్య‌ను హింస‌ల‌కు గురి చేస్తున్నారు. పెళ్ళై ఎన్నో ఆశ‌ల‌తో మొట్టినింటిలో అడుగుపెట్టిన భార్య‌ను ఎంతో అపురూపంగా చూసుకోవ‌ల‌సిన భ‌ర్తే క్రూర మృగంలా ప్ర‌వ‌ర్తించాడు. అనంత‌పురం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.  భార్య కాళ్లు, చేతులు కట్టేసి స్నేహితుడితో కలిసి భర్త సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. అది మ‌రువ‌క ముందే తాజాగా అదే తరహాలో అత్యంత దారుణ ఘటన మరొక‌టి వెలుగుచూసింది. ఐరన్ బాక్స్‌తో భార్య ఒళ్లంతా కాల్చి పైశాచికంగా ప్రవర్తించిన మరో కసాయి భర్త ఉదంతం బయటపడింది.

భార్యను ఐరన్ బాక్స్‌తో ఒళ్లంతా కాల్చి హింసించిన ఘటన కదిరి నియోజకవర్గంలో జరిగింది. నల్లచెరువు మండలం ఊరువాయి గ్రామానికి చెందిన చంద్ర తన భార్య రేణుకపై పైశాచికత్వం ప్రదర్శించాడు. బట్టలు ఇస్త్రీ చేసే ఐరన్ బాక్స్‌తో రేణుక ఒళ్లంతా కాల్చి గాయపరిచాడు. కాలిన గాయాలతో విలవిల్లాడుతున్న భార్య రేణుకను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


గత వారం రోజుల్లోనే కదిరిలో భర్తల చేతిలో భార్యలు ప‌డే హింస‌లు గురైన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కట్టుకున్న భార్యల పట్ల అమానుషంగా ప్రవర్తించడం పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేణుక భర్త చంద్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. నాలుగు రోజుల కిందట భార్యపై స్నేహితుడితో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన మల్లేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్ళ‌ను మాములుగా వ‌ద‌ల‌కూడ‌దని ప్ర‌జా సంఘాలు నినాదాలు చేస్తున్నారు.  ఇక‌పోతే గ‌త వారం ప‌ది రోజుల నుంచి జ‌రుగుతున్న మ‌హిళ‌ల పై అరాచ‌కాల‌కు అంతు లేకుండా పోతుంది. దీనికి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటేగాని బుద్ధిరాదు. ఏ మ‌గాడైనా మ‌హిళ‌ను క‌న్నెత్తి చూడ‌డానికి కూడా భ‌య‌ప‌డేంత‌లా శిక్ష‌లుక‌ఠినంగా ఉంటేనేగాని మ‌గ‌మృగాళ్ళు మార‌ర‌నిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published.