బాలీవుడ్ నటి రిచాచద్దా ‘ఫ్రీ హగ్స్‌’


జనవరి 21, 2020 న ప్రపంచవ్యాప్తంగా చాలా మంది హగ్ డే జరుపుకున్నారు. ఈ క్రమంలో కౌగిలింతల దినోత్సవం సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి రిచాచద్దా కూడా ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక అనుభూతిని పొందారు. ముంబయి వీధిలో వెళ్తున్న అపరిచితులకు కౌగిలింతలు ఇచ్చి అందిరిని చిరునవ్వుతో పలకరించింది. చేతిలో ‘ఫ్రీ హగ్స్‌’ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని మరీ అందర్నీ ఆప్యాయంగా హాగ్ చేసుకుంది. ఇట్టి సన్నివేశాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ తో పంచుకున్నారు. రిచా క్యాప్షన్‌లో.. ‘ఈ ప్రపంచంలో ఎంతో ద్వేషం ఉంది.. అందుకే ప్రేమతో దాన్ని తగ్గించాలి అనుకున్నా. నేను అపరిచితుల్ని కౌగిలించుకున్నా.. ఇది ఓ మ్యాజిక్‌లా అనిపించింది. ప్రతి ఏడాది ఇలా చేయాలి అనిపిస్తోంది. వచ్చే ఏడాది మీరు నన్ను కలవొచ్చు..’ అని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published.