విరాట ప‌ర్వంలో రానా లుక్ అదుర్స్‌!


బహుబలి మూవీలో హీరో బాహుబలి పాత్ర చేసిన ప్రభాస్‌కి ఎంత పేరు వచ్చిందో .. విలన్ బల్లాల దేవుడి పాత్రలో రానాకు కూడా అంతే పేరు వచ్చింది. టాలీవుడ్‌ స్టార్ ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీనుంచి వచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటికి తన టాలెంట్‌తో టాలీవుడ్‌లోనే కాకుండా ఏకంగా కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ యంగ్  హీరో ప్ర‌స్తుతం భారీ ప్లాన్‌లో ఉన్నాడు. ఆరోగ్య సమస్యల కారణంగా కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రానా, ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న టాలీవుడ్‌ హంక్‌ త్వరలో ఓ భారీ చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.
ఎన్టీఆర్‌ బయోపిక్‌ తరువాత రానా ఏ సినిమాలోనూ నటించలేదు. ఆ సినిమాలో చంద్రబాబు పాత్రలో కనిపించిన రానా, ఆ పాత్రలో చాలా సన్నగా కనిపించాడు. అయితే ముందుగా క్యారెక్టర్‌ కోసమే రానా బరువు తగ్గాడని భావించినా, తరువాత ఆరోగ్యం సరిగాలేదన్న వార్తలు రావటంతో అంతా నిజమే అనుకున్నారు.

యంగ్ హీరో రానా స్పీడు పెంచాడు. ఇప్పటికే అరణ్య షూటింగ్ పూర్తి చేసిన రానా, తాజా తన నెక్ట్స్‌ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రివీల్ చేశాడు. ఈ రోజు రానా పుట్టిన రోజు సందర్భంగా విరాట పర్వం సినిమాలోని రానా లుక్‌ని రివీల్ చేశారు. ఈ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో సినిమా కంటెంట్‌ ఎలా ఉండబోతుందో కూడా హింట్‌ ఇచ్చారు. నీది నాది ఒకే కథ ఫేం వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాలో సాయి పల్లవి రానాకి జోడిగా నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో సాయి పల్లవి నక్సలైట్‌ పాత్రలో నటిస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published.