సూర్య హీరోగా రూపొందించిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’

సూర్య హీరోగా ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్. గోపీనాథ్ జీవితం ఆధారంగా దర్శకురాలు సుధ కొంగర రూపొందించిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం గురువారం సినిమాలోని రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేసింది. దేశంలో ఒక ఫ్లైట్ లో సినిమా పాట విడుదలవడం ఇదే ప్రథమం.గా చెప్పాలి.
‘పిల్ల పులి’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన 1 మినిట్ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ పాటలో హీరో హీరోయిన్లు సూర్య, అపర్ణా బాలమురళి మధ్య రొమాన్స్ అలరిస్తోంది. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. కాగా ఈ పాట విడుదల కోసం నిర్వహించిన పోటీలో ఎంపికైన అగరం ఫౌండేషన్ కు చెందిన 100 మంది అండర్ ప్రివిలేజ్డ్ బాలలు, చిత్ర బృందం సమక్షంలో దీనిని ఆవిష్కరించడం విశేషం. ఈ కార్యక్రమంలో దర్శకురాలు సుధ కొంగర, హీరో మోహన్ బాబు చిత్ర యూనిట్ పాల్గొంది.