హిట్ కోసం పరితపిస్తున్న రవితేజ

ఫలితం గురించి అంతగా పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు హిట్ కోసం పరితపించాల్సి వస్తోంది. ఇందుకు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నా… కానీ కాలం అస్సలు కలిసి రావడం లేదాయనకి, గత ఫ్లాపులతో పోలిస్తే డిస్కోరాజా కొంతైనాస్త నయమనిపించేలా ప్రేక్షకులనే కాదు రవితేజనీ ఊరడించింది. ఈ సినిమా కొంత బెటర్ అని టాక్ రావటంతో ఊపిరి పీల్చుకుని కొత్త సినిమాలవైపు దృష్టి సారించాడు.
ఇండస్ట్రీలోకి సాధారణ క్లాప్ అసిస్టెంట్ స్థాయి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆ పై మాస్ హీరోగా ఎదిగిన రవితేజ కష్టాన్ని జనం గుర్తిస్తున్నా… ఎంచుకున్న కథలే కలసి రావటంలేదు. భిన్నంగా ఉందని ఆరంభించి, చివరకి చింపి చింపి తిరిగి రొటీన్ చేసేస్తుండటంతో ప్రేక్షకులు విసిగి వేసారిపోతున్నారు. దీంతో తిరిగి కలసి వచ్చిన హిట్ కాంబినేషన్‌తోనే రావాలని భావిస్తున్న రవితేజ తనకు ‘డాన్ శీను’, ‘బలుపు’ లాంటి హిట్స్ ఇచ్చిన గోపిచంద్ మలినేనితో జతకట్టి తాజాగా ‘క్రాక్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఓ వైపు అవుతుండగానే తనకు ‘వీర’ లాంటి డిజాస్టర్ ఇచ్చిన రమేశ్ వర్మ డైరెక్షన్లో మరో మూవీకి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
వరుస ఫ్లాపులు చవిచూస్తున్న రమేష్ ఇటీవలే రాక్షసుడు రీమేక్‌తో మంచి విజయాన్నే అందుకున్నాడు. ఈ మధ్య ఓ ఫంక్షన్లో రాక్షసుడు సినిమా గురించి ప్రస్తావించిన రవితేజకు ఇద్దరం కలిసి మరో మంచి సినిమా చేద్దామని చెప్పడంతో రవితేజ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు విక్రమార్కుడు తరహాలో ఓ ఎగ్జైట్ చేసే స్క్రిప్ట్ తయారు చేసుకుని ఇంటికి వెళ్లి మరీ వినిపించాడట రమేష్. పైగా ఇది పొలిటికల్ ప్రోజెక్టు కావటం, ఈ చిత్రం ఒక సీఎం పీఎ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాడు.. అతడు అవినీతికి పాల్పడితే ఎలా ఉంటుంది.. అతడు మంచి వాడుగా మారినా ముందు ప్రాభావం ఎలా ఉంది.. అనే విషయాలను ను లోతుగా చూపిస్తాడట. ఈ సీఎం పీఏ పాత్ర చిత్రానికి కీలకమని, అలాగే సిఎంకి ప్రత్యర్థి పాత్ర కూడా రవితేజని కనెక్ట్ అవ్వడంతో ఈ రెండు పాత్రలలో తనే నటించేందుకుసిద్దమైనట్టు సమాచారం.