వీరులకు క్వీన్స్ సెల్యూట్

శత్రువుపై భారత వైమానిక దళం పరాక్రమం గురించి పలువురు అగ్ర కథానాయికలు ప్రశంసల జల్లు కురిపించారు. ఉగ్రవాదుల ఏరివేతపై హర్షిస్తూ ఇండియా స్ట్రైక్స్ బ్యాక్ అంటూ నినదించడం ఆసక్తికరం. మునుపటితో పోలిస్తే నేటి తరం తారల్లో దేశభక్తి మెండుగా ఉందని చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్. బాలీవుడ్ క్వీన్..  స్టార్ హీరోయిన్ కంగన లో దేశభక్తి మెండు. ఇటీవలే స్వాతంత్య్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్రలో అద్భుతంగా నటించిన కంగన మరోసారి తన దేశభక్తిని చాటుకున్నారు. తాజాగా చేపట్టిన సర్జికల్ స్ట్రైక్‌ని, భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసల్లో ముంచెత్తింది. తీవ్రవాదంపై పోరాటాన్ని ప్రశంసించిన కంగన చాలా  కాలంగా జమ్ము కశ్మీర్ బార్డర్ నియమావళిలో ఉన్న ఆర్టికల్ 370ని చెత్త బుట్టలో వేయాలని, ఇండియా సత్తా చాటి చూపించాలని కోరారు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ సైతం ప్రధాని మోదీ నిర్ణయాన్ని ప్రశంసించారు. భారత వైమానిక దళంలో పని చేసిన వీరాధివీరులకు శాల్యూట్ తెలిపారు. ఇండియా స్ట్రైక్స్ బ్యాక్ అంటూ నినదించారు. ఇండియా ప్రతీకారం తీర్చుకుంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. కేవలం వీళ్లు మాత్రమే కాదు..  టాలీవుడ్ , బాలీవుడ్ లో అగ్ర కథానాయికలంతా సెల్యూట్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. కాజల్ ప్రస్తుతం కంగన నటించిన క్వీన్ రీమేక్ ‘పారిస్ పారిస్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Leave a Reply

Your email address will not be published.