మూడు రాజధానుల ప్రతిపాదన…

రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన ఏ క్షణాన ప్రకటించిందో కానీ ఏపిలో దాదాపు అన్ని జిల్లాలలో అనుకూల, ప్రతికూల వర్గాలు తయారయ్యాయి. ఇప్పటికే ఇదే అంశంపై అమరావతి జేఏసి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబులు రాజధాని పరిసర గ్రామాలతో పాటు రాష్ట్రంలోని నలు మూలలా పర్యటించి నిరసన ర్యాలీలు, సభలలో పాల్గొంటుంటే వైసిపి కూడా మూడు రాజధానులకు అనుకూల ధర్నాలు చేస్తునే ఉన్నారు.
అయితే ఈ మూడు రాజధానుల ప్రతిపాదనలపై సినీ రంగం మరో మారు ముక్కలైనట్టే కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఈ ప్రతిపాదనని స్వాగతించగా, ఆతని సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు పూర్తి వ్యతిరేకంగా రైతుల ధర్నాలలో పాల్గొంటున్నారు. మరికొందరు సినీ నటులు కూడా అనుకూల, వ్యతిరేక వ్యాఖ్యలు చే్స్తూ వస్తున్నారు ఇప్పటికీ…
ఈ క్రమంలోనే అమరావతి వచ్చిన ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ మందడంలో దీక్ష చేస్తున్న రైతుల శిబిరంకి వచ్చి రైతుల ఉద్యమానికి మద్దతు తెలియజేసారు. రైతుల కష్టాలు వారి నుంచే తెలుసుకున్నారు. అనంతరం మీడియాలో ఆయన మాట్లాడుతూ… ఉద్యమానికి మద్దతు కోసం సినీహీరోలను రైతులు అడ్డుకోవాల్సిన అవసరం లేదని, వాళ్ల సినిమాలు చూడటం మానేయటంతోనే వాళ్లే దిగివస్తారని అన్నా రు. చిరంజీవితో పలు సూపర్ డూపర్ చిత్రాలు నిర్మించిన ఆయన చిరు రాజధానులకు మద్దతు ఇవ్వడంపై మండి పడ్డారు ప్రపంచంలో బహుళ రాజధానుల వ్యవస్థ విఫలమైనట్లు చిరంజీవికి తెలియదా? ఏం లాభమని, అసలు ఆతనికీ విషయంలో ఏం తెలుసని మూడు రాజధానులు బాగుంటాయని చెప్పారని నిలదీసారు. పవన్ కల్యాణ్ తన సినిమాలతో కోట్లలో సంపాదించే ఆస్కారం ఉన్నా… సినీ జీవితాన్ని వదిలేసి రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నాడో ఆయనకి తెలియదనుకోవటం లేదని అన్నారు. బహుళ రాజధాని వ్యవస్థను సమర్థించే వాళ్లెవరైనా తన దృష్టిలో మూర్ఖులే అన్నారు.
రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా సినీ నటుడు పృథ్వీరాజ్ పేర్కొనటాన్ని అశ్వనీదత్ తప్పు పట్టారు. ఇలాంటి వాళ్లను పక్కన పెట్టుకుంటే జగన్ కు మరింత అపప్రద రావటం ఖాయమని వ్యాఖ్యానించారు.