జె ఎన్ టి యూ లో బయట పడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

‘బిటెక్’ చదవకుండానే ‘ఎంటెక్’ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్న పలువురు ప్రొఫెసర్లు అడ్డంగా దొరికిపోయారు, జవహర్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధి లో గల ఇంజనీరింగ్ మరియు మెడికల్ కళాశాలలో విద్యాబోధన చేస్తున్న పలువురు ప్రొఫెసర్లకు కనీసం బీటెక్ అర్హత కూడా లేదని తెలిసింది నకిలీ సర్టిఫికెట్ల తో ఉద్యోగం పొంది విద్యాబోధన చేస్తున్నట్లుగా పిర్యాదులు రావటం తో గత పదిహేను రోజుల నుండి దాదాపు మూడు వందలమంది ప్రొఫెసర్ల విద్యార్హత పట్టాలు పరిశీలించగా వాటిలో వంద మందివి నకిలిపట్టాలని తేలింది . ఈ నకిలీ ప్రొఫెసర్ల పై చర్యలు తీసుకొనుటకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.  

Leave a Reply

Your email address will not be published.