హ్యాట్రిక్ ద‌ర్శ‌కుడితో విజ‌య‌శాంతి… మ‌ళ్ళీ అదే బ్యాన‌ర్‌లో…?


టాలీవుడ్‌లో ఒక టైంలో విజ‌య‌శాంతి ఇండ‌స్ట్రీని ఒక ఊపు ఊపింది. హీరోయిన్‌గా చేసి మంచి పేరు తెచ్చుకోవ‌డ‌మే కాక‌, లేడీ ఓరియంటెడ్ స్టోరీస్‌తో `రాముల‌మ్మ‌`గా చాలా ఇన్స్‌పిరేష‌న్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టించింది. చాలా గ్యాప్ త‌ర్వాత ఇటీవ‌లె మ‌హేష్‌బాబు చిత్రంలో స‌రిలేరు నీకెవ్వ‌రుతో తిరిగి ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇటీవ‌లె పూర్త‌యింది. త్వ‌ర‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఇదిలా ఉంటే  యువ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతానికి ఈయన తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ.  కాగా ఇటీవలే ఈ సరిలేరు నీకెవ్వరూ చిత్రానికి సంబందించిన షూటింగ్ ని పూర్తి చేసుకున్న అనిల్ రావిపూడి, ఇక త్వరలోనే మరొక చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. అయితే ఈ తాజా చిత్రానికి సంబందించిన ఒక లేటెస్ట్ వార్త ప్రస్తుతానికి సామజిక మాద్యమాల్లో బాగా చక్కర్లు కొడుతుందని చెప్పాలి.

కాగా 2109 మొదట్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి ‘ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్ ‘ఎఫ్ 3’ ని తెరకెక్కించే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ ‘ఎఫ్ 3’ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేసినట్టు సమాచారం. ఇక ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు రవితేజ కూడా నటిస్తాడని, అందులో కూడా రవితేజ అంధుడిగానే కనబడనున్నాడని సమాచారం. అయితే ఈ చిత్రంలో మరొక ముఖ్యమైన పాత్ర కోసం విజయ శాంతి ని కూడా దర్శకుడు ఒప్పించారని సమాచారం. కానీ ఈ కాంబినేషన్ విషయంలో ఒక అధికారిక ప్రకటన విడుదలవ్వాల్సి ఉంది. 


Leave a Reply

Your email address will not be published.