నలుగురు హీరోయిన్ ల లవర్ బాయ్ కోసం…..


టాలీవుడ్ లోకి సాధార‌ణ హీరోగా వ‌చ్చి త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మైమ‌ర‌పించి టాప్ స్టార్ గా ఎదిగిన‌ విజయ్ దేవరకొండ సినిమాలకు యూత్‌లో ఎనలేని క్రేజ్ ఉంటుందన‌టంలో సందేహం లేదు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్ డూపర్ హిట్స్‌తో త‌న‌యూత్ ఫాలోయింగ్‌ను పెంచ‌కుని రౌడీ బోయ్ గా పేరు సంపాదించుకున్నాడు. ఆ మ‌ధ్య ఎన్నో అంచనాల మధ్య విడుదలైన‌ డియర్ కామ్రేడ్ నేల‌చూపులు చూసినా విజయ్ క్రేజ్ ని లేశ మాత్రం కూడా త‌గ్గించ‌లేక పోయింది. 

ప్రేమికుల రోజున‌ వరల్డ్ ఫేమస్ లవర్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుండ‌టం అందునా ఈ సినిమాలో విజయ్ సరసన ఐశ్వర్యా రాజేశ్, ఇసబెల్లా, రాశీ ఖన్నా, క్యాథరిన్ థ్రెస్సాలు న‌లుగురు హీరోయిన్లుగా నటిస్తుండటం, వీరి పోస్టర్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతుండ‌టం తో సినిమాపై అంచాలు బాగా పెరిగాయి. 

ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ట్రెయిలర్ లో విజయ్ దేవరకొండ ఒక్కో హీరోయిన్‌తో ఒక్కో త‌ర‌హాలో కన్పించడంతో సినిమాని పీక్ కి తీసుకుకెళ్లింది. ప్రేమ చుట్టూనే తిరుగుతున్న సన్నివేశాలు ట్ర‌యిల‌ర్‌లో ఉండ‌టంతో ఈ సినిమా కోసం జ‌నం ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.