హిందీ కాంచ‌న‌లో వివాదం లేదంటున్న అక్ష‌య్

తెలుగుతో స‌హా ద‌క్షినాదిన హిట్ టాక్ అందుకుని ఉత్కంఠ భ‌రిత సినిమాగా ప్రేక్ష‌కుల‌లో హీటెక్కించిన కాంచ‌న సినిమాను `ల‌క్ష్మీబాంబ్` పేరుతో తెర‌కెక్కిస్తున్నాడు కొరియోగ్రాఫ‌ర్‌, న‌టుడు, నిర్మాత, ద‌ర్శ‌కుడు రాఘ‌వ లారెన్స్ .  కామెడీ హార‌ర్ జోన‌ర్ సిరీస్ కాంచ‌న లో అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టిస్తుండ‌టం విశేష‌. ఈ మ‌ధ్య   ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ద‌ర్శ‌కుడు లారెన్స్‌, నిర్మాత‌ల‌కు మ‌ధ్య రేగుతున్న గొడ‌వ‌లు పెద్ద‌వి కావ‌టంపైగా.. ద‌ర్శ‌కుడైన లారెన్స్ అనుమ‌తి లేకుండానే చిత్రానికి సంబంధించిన   ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌డం తో సినిమా నుంచి తాను త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించుకున్నాడు లారెన్స్. భారీ బ‌డ్జెట్ సినిమాగా వ‌స్తున్న ఈ సినిమా ఆగిపోతే త‌న‌కు కూడా ఇబ్బంది వ‌స్తున్నంద‌ని భావించిన అక్ష‌య్ కుమార్ ఈ వ్య‌వ‌హారంపై తొలిసారిగా అక్ష‌య్ కుమార్ స్పందించారు. ద‌ర్శ‌క నిర్మాత‌ల న‌డుమ‌ రేగుతున్న   వ్య‌వ‌హారాన్ని చ‌క్క‌పెట్టడంతో సామ‌ర‌స్య వాతావ‌ర‌ణంలో  సినిమా చిత్రీక‌ర‌ణ చేయ‌డానికి లారెన్స్ ఒప్పుకోవ‌టంతో వివాదం కాస్త విజ‌య‌వంతంగా ముగిసింద‌ని అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 అయినా సామాజిక మీడియాలో ఈసినిమా వివాదంపై అనేక విధాలుగా సెటైర్లు ట్రోల్ అవుతుండ‌టంపై అక్ష‌య్ స్పందిస్తూ, 
“లారెన్స్‌కి, నిర్మాత‌ల‌కు మ‌ధ్య  ఇబ్బందులు వ‌చ్చిన మాట వాస్త‌వ‌మేన‌ని, అయితే వారి ఏం జ‌రిగిందో నాకు తెలియ‌దు కానీ ఈ వివాదం ఇప్ప‌టికే స‌ర్దుమ‌ణిగింద‌ని తేల్చి చెప్పాడు. సినిమా అంతా షెడ్యూల ప్ర‌కార‌మే జ‌రుగుతోంది.  సినిమాలో పాత్ర కోసం త‌న‌తో లారెన్స్ చీర‌లు క‌ట్టించి ప‌రుగులు తీసేలా న‌టింప చేస్తుండ‌టం  కొత్త‌గా  అనిపిస్తోంది. నే చేసిన‌ స‌న్నివేశాలన్నీ బాగా ఉన్నాయి.  చిత్రం మే నెల‌లో విడుద‌ల కానుంద‌ని అన్నాడు అక్ష‌య్‌.  ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న విష‌యం విదిత‌మే…
 

Leave a Reply

Your email address will not be published.