మిథాలీ పాత్రలో తాప్సీ పొన్ను

ఇటీవలి కాలంలో ప్రముఖులను ఎంచుకుని వారి జీవితాను నిశితంగా పరిశీలించి, కొన్ని అంశాలనెంచుకుని,వాటి ఆధారంగా చిత్రాలు తీయడం ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు.. బాలీవుడ్లో ట్రెండ్‌గా మారింది. దాదాపు భారతావనిలోని డైరెక్టర్లంతా బయోపిక్‌ల మీద పడి, ఎవరెవరు ఏ రంగంలో ప్రఖ్యాతి చెందారో… చూసి మరీ వరుస సినిమాలు తీసేస్తున్నారు.
అయితే ప్రస్తుతం ప్రముఖ క్రీడాకారిణి, ప్రపంచ మహిళా క్రికెట్‌లోఅత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథను వెండితెరపైకి తీసుకొచ్చేందుకు వయాకామ్ 18 సంస్థ రంగంలోకి దిగింది. ‘శభాష్ మిథూ’ పేరుతో రాయీస్ ఫేమ్ రాహుల్ దొలాకియాదర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మిథాలీ పాత్ర తాప్సీ పొన్ను పోషించనుందని, చిత్ర వర్గాలు తాజాగా ప్రకటించాయి. సుదీర్ఘకాలం ఇండియాకు ప్రాతినిథ్యం వహించి ఇటీవలే.. టీ 20లకి గుడ్ బై చెప్పిన మిథాలీ జీవితాన్ని అతి త్వరలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లుతున్నట్లు నిర్మాతలు తెలిపారు