విడుదలకు సిద్ధమైన ‘బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్’

ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్’

. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించారు. గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు. దర్శకుడు నాగసాయి మాకం తెరకెక్కించిన బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. మార్చి రెండో వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
        ఈ సందర్భంగా నిర్మాత మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ…మంచి కథకు నిర్మాణ విలువలు తోడయితేనే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెద్ద నిర్మాణ సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రాన్ని నిర్మించాము. పూర్తి వినోదాత్మక చిత్రంగా ఉంటూనే ఆలోచింపజేసే సినిమా అవుతుంది. ఇవాళ సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్యనూ ఇందులో చూపించాం. నిర్మాణాంతర కార్యక్రమాలు నాణ్యతతో చేశాము. ప్రస్తుతం మా సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి రెండో వారంలో ఒక పెద్ద పంపిణీ సంస్థ ద్వారా వీలైనన్ని ఎక్కువ కేంద్రాల్లో బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్నారు.
           దర్శకుడు నాగసాయి మాకం మాట్లాడుతూ..కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునే ఒక చిత్రాన్ని మేము రూపొందించాం. ఇందులో ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేని కథా కథనాలు ఉంటాయి. బిలాల్ పూర్ అనే ఊరి పోలీస్ స్టేషన్ కు వచ్చే వింత వింత కేసులు కడుపుబ్బా నవ్విస్తాయి. సినిమా చూస్తున్న వాళ్లకు తమ ఊరిలో జరిగే సంఘటనలు గుర్తొస్తాయి. సినిమా ఆద్యంతం సహజమైన పాత్రలతో, సన్నివేశాలతో సాగుతుంటుంది. అన్నారు.

ప్రణవి, ఆర్ ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – తోట వి రమణ, ఎడిటింగ్ – ఎస్ బీ ఉద్ధవ్, సంగీతం – సాబూ వర్గీస్, రీ రికార్డింగ్ – జీబూ, డీటీఎస్ – రాజశేఖర్, పాటలు – గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనిశ్రీ మల్లిక్, నీల నర్సింహా, కథా, నిర్మాత – మహంకాళి శ్రీనివాస్, రచన, దర్శకత్వం – నాగసాయి మాకం.

Leave a Reply

Your email address will not be published.