ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా భూపేష్

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఎంపికపై కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గత ఐదు రోజులుగా విస్తృత చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బాఘెల్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇవాళ జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి సీఎం రేసులో ఉన్న టీపీ సింగ్ దేవ్, తమరాథ్‌వాజ్ సాహు, భూపేష్ బాఘెల్ , చరణ్ దాస్ మహంత్‌లతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.