కరోనా పై విజయ్ దేవరకొండ తో ప్రచార యుద్ధం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు తీవ్రం అవుతోంది. వేసవి సమీపిస్తున్నా హైదరాబాద్‌తో సహా తెలుగురాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో వాతావరణం హఠాత్తుగా చల్లబడుతుండటంతో కరోనా వ్యాప్తికి అనుకూలంగా మారుతోందన్న ఆందోళనలో ప్రభుత్వాలున్నాయి.
ఇప్పటికే తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు అనేక జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ప్రత్యేక పరీక్షా కేంద్రాలు, ఆసుపత్రులను ఏర్పాటు చేసాయి. ఈ క్రమంలోనే ప్రజలను అప్రమత్తం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి సినీ హీరో, విజయ్ దేవరకొండ తో కరోనా పై ప్రచార లఘు చిత్రాన్ని రూపొందించి విడుదల చేసింది. దీనిని ప్రధాన రోడ్లతో పాటు వివిధ ఛానళ్లలో, సినిమా ప్రారంభానికి, చివరన్న ప్రసారం చేస్తారు.
విజయ్ తో రూపొందించిన ఈ ప్రచార చిత్రాన్ని కరోనా ప్రచార చిత్రంలో మీ సన్నిహతులైనా, మిత్రులైనా ఎవరు కలసినా వారికి ప్రతి నమస్కారం పెట్టండి, కొన్నాళ్ళు షేక్ హ్యాండ్ ను దూరంగా పెట్టండి అంటూ విజయ్ విన్నవించారు. అలానే పదేపదే ముక్కు, కళ్లను చేతులతో ముట్టుకునే ప్రయత్నం చేయకుండా చూసుకోవాలని, వీలున్నంత వరకు. ప్రతి గంటకు ఒకమారు చేతులు శుభ్రంగా కనుక్కోవాలని, ఇలా చేయడం వలన కరోనా నుంచి కొంత బయటపడే అవకాశం ఉంటుందని తెలియజేసారు.