రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాను…సుమ‌న్

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజాసంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సినీ న‌టుడు సుమ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేసారు.  గురువారం ఆయన హైదరాబాద్‌ నుంచి కోదాడకు వెళ్తూ మార్గంమధ్యలో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని వివేరా హోటల్‌లో విలేకరుల తో మాట్లాడారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనంటే ఎనలేని అభిమానమని చెప్పారు. తెలంగాణకు కేసీఆర్‌ సేవలు చాలా అవసరమన్నారు.  రాజకీయాల్లోకి వ‌స్తారా? అని ప్ర‌శ్నిస్తే, నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
. ప్రస్తుతం నాలుగు కొత్త చిత్రాల్లో నటిస్తున్నానని, మ‌రి కొన్ని క‌థా చర్చ‌ల‌లో ఉన్నాయ‌ని తెలిపారు. ను 
 

Leave a Reply

Your email address will not be published.