నానితో మరోమారు జత కడుతున్న రీతూ వర్మ

నేచురల్ స్టార్ నాని, శివనిర్వాణ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘నిన్నుకోరి’ చిత్రం మంచి విజయాన్ని సాధించగా ఇప్పుడు అదే హిట్ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నాని సరసన హీరోయిన్ గా పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ ఎంపికైనట్లు సమాచారం అందుతోంది.
గతంలో ‘ఎవడేసుబ్రమణ్యం’ మూవీలో నానితో నటించిన రీతూవర్మ పెళ్లి చూపులు , కేశవ చిత్రాలలో నటించి మంచి నటి అనిపించుకుంది. కాగా ఈ డిసెంబర్ నెలలో సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభిస్తామని, జనవరిలో రెగ్యులర్ షూటింగ్‌ను చేస్తామని నిర్మాతలు చెపుతున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ మీడియాకు తెలియజేసింది.