సోషల్‌మీడియా లో అగ్రస్థానం ‘ఫేస్ బుక్’ దే

ప్రస్తుతం అరచేతిలో ఇమిడిపోతున్న ప్రపంచంలో సోషల్ మీడియా పాత్ర కీలకంగా మారింది. అందునా యాప్స్ అనేక అంశాలలో జనాలకి సహకరిస్తుండటం ఒక ఎత్తయితే అనేక వార్తాంశాలను జనం ముందుకు మోసుకుపోగల సత్తా తమకే ఉందని సామాజిక మీడియా మరోసారి రుజువు చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ దశాబ్దకాలంలో అత్యధికమంది డౌన్ లోడ్ చేసిన యాప్‌లపై డిజిటల్ స్పేస్‌లో టాప్ లిస్టులో ఉన్న జాబితాను యానీ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఫేస్ బుక్, ఫేస్ బుక్ మెసెంజర్ లు మొదటి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. ఆ తర్వాత గూగుల్ పే, ఫోన్ పే నిలవగా, ఒకే యాజమాన్యానికి చెందిన వి టాప్ 10లో తమ హవా చూపించడం విశేషం.
యాప్‌ల వాడకం ఆరంభమైన 2010 నుంచి ఇప్పటి వరకు యూజర్లు ఎక్కువగా డౌన్లోడ్ చేసిన చేసిన వాటిలో ఫేస్ బుక్ అగ్రస్థానంలో ఉంది. నిజానికి మధ్య మధ్యలో భద్రతా కారణాలు, కేంబ్రిడ్జ్ ఎనలైటికా లాంటి సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి నెటిజన్లని ఆకట్టుకుని ముందంజలో నిలవడం విశేషం. డిజిటల్ స్పేస్‌లో టాప్ లిస్టులో ఉన్న జాబితాతో యూజర్లు ఎక్కువగా డౌన్లోడ్ చేసుకున్న యాప్స్: ఫేస్బుక్, ఫేస్బుక్ మెసేంజర్, గూగుల్ పే, ఫోన్ పే, వాట్సాప్, యూసీ బ్రౌజర్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్, యూట్యూబ్, ట్విటర్ లు ఉన్నాయి.